News

చొక్కా ధరించడం వల్లే గుర్తింపు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పసుపు చొక్కా ధరించడం వల్లే తనకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని అన్నారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌‌లో ఆయన మాట్లాడుతూ ఈ పచ్చ చొక్కానే ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిందన్నారు. ప్రతి మూడునెలలకోసారి తనకు తాను పరీక్ష రాసుకుంటున్నానని తన పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నానని బాబు పేర్కొన్నారు.